ABN -ANDHRA JYOTHI

ABN Andhrajyothy Live TV

Friday, January 30, 2009

కొల్లాపూర్ చరిత్ర



కొల్లాపూర్ చరిత్ర
పూర్వం "కొలుమల పల్లె" గా పిలువబడిన ఈ ప్రాంతం నేడు కొల్లాపూర్ గా వ్యవహరిస్తున్నారు. దీని వెనుక ఛారిత్రక నేపథ్యం కలదు. పూర్వం ఎల్లూరు కోటను నిర్మించడానికి గాను ఈ ప్రాంతం లో కంచర్లు" "కొలుములు నడిపేవారు. అప్పుడు ఈ ప్రాంతం జనావాస యోగ్యంగా లేక అక్కడక్కడ విసిరేసినట్లు ఇల్లు ఉండేవి. మొత్తానికి ఒక చిన్నపల్లె గా ఉండేదని చరిత్ర. 19 శతాబ్ధి మధ్యమ కాలంలో రాజా వేంకట లచ్మా రావ్ [1865 -1887] కాలంలో ఈ ప్రాంతాన్ని సానగ వంశీయులైన ఎల్లోజు సోదరుల వద్ద కొని వీరు కోట నిర్మాణం చేపట్టారని చరిత్ర. ఎంతో ఘన చరిత్ర, విశిష్ట సంస్కృతి కలిగిన మన ప్రాంతానికి మనకు ఉండటం గర్వకారణం. సురభి వంశానికి మూలపురుషుడు " భేతాళ నాయకుడు".ఇతనే ఎన్నో రాజవంశాలకు మూలపురుషుడు. ..దక్షిణ భారతం లోనే సుసంపన్నమైన రాజ్యం మనదే. దక్షిణ భారతంలో మొదట విమానాన్ని నడిపిన చరిత్ర మన వారిది. ఈ విధంగా చరిత్ర కల్గినప్పటికి నేడు దుర్భర దారిద్ర్యాన్ని కొల్లాపూర్ ప్రజలు అనుభవిస్తున్నారు. దీనికి కారణాలు అనేకం. ఇక్కడి నుండి ఎంతో మంది ప్రజానీకం పొట్ట చేత్తో పట్టుకుని పట్టణ ప్రాంతాలకు వలసలు వెళ్ళడం నిజంగా బాధాకరం. ప్రస్తుతం కొల్లాపూర్ ప్రజల దాహార్తిని తీర్చి వీరికి సాగు తాగు నీరందించే "కె. ఎల్.ఐ" పనులు శరవేగంగా జరిగి ఈ ప్రాంత వాసుల దాహార్తి తీరుతుందని కోరుకుంటూ........ఇంకాబ్ల్లాగ్ పూర్తి కాలేదు....
............... నిర్మాణంలో ఉంది. మరిన్ని వివరాలకై ...

.మీ తూర్పింటి నరేశ్ కుమార్
:nareshrgukt23@gmail.com
ఇది కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన వారి బ్లాగ్
ఈ ప్రాంతపు చరిత్ర, సంస్కృతి, ఆచారాలు, సామాజిక జీవన విధానాల గురించి తెల్పడమే దీని ముఖ్యోద్దేశ్యం.
నరేశ్ కుమార్ .తూర్పింటి